money money telugu song lyrics | Chakravarthiki veedhi

 Seetharama Sastry gari Animutyalu

Movie : MONEY

Song :  Chakravarthiki veedhi
Singer : SP Balu
Music : MM keeravani
Lyrics : Sirivennela Seetharama Sastry
Duration: 05 min 49 sec
Director : Siva Nageswara Rao
Producer : Ram gopal Varma, RGV
LanguageTelugu
Cast : JD Chakravarthy , Jayasudha
Release Date: June 10th  1993

seetharama sastry garu Manishi ga mana madhya lekapoyina paata ga nityam manathone vuntaru..Aayana kalam nundi dabbu midha vacchina song idhi. avvadaniki sri music director aina ee paata keeravani garu compose chesaru..
money money Telugu Video Song : 


.:: SONG LYRICS ::.

Chakravarthiki veedhi bicchagatthiki bandhuvavuthanani andhi money money
amma chuttamu kaadhu ayya chuttamu kadhu aina anni andhi money money
Paccha notu tho life laksha linkulu pettukuntundhani andhi money money
puttadaniki paade kattadaniki madhya antha thane andhi money money

kaalam kareedhu cheddam padhandi andhi money money
thailam tamasha chuddham padandi andhi money money
dabbu ni labudabbani gundello pettukora
deekshaga danalakshmi ni love aadi kattukora

Chakravarthiki veedhi bicchagattheki bandhuvavuthanani andhi money money
amma chuttamu kadhu ayya chuttamu kadhu aina anni andhi money money

intaddhe kattava naa thandri no entry veedhi vakitlo
dongalle doorali silently ni intlo chimmachikatlo
andhuke padha brother money vetaki
appuke padha brother prathi pootaki
Roti kapda roomu anni rupee roopale
sommune saranamani charanamu nammukora
deekshaga danalakshmini love aadi kattukora

Chakravarthiki veedhi bicchagattheki bandhuvavuthanani andhi money money
amma chuttamu kadhu ayya chuttamu kadhu aina anni andhi money money

preminchukovacchu darjagaa picturelo pedha herola
dreaminchukovacchu dheemaga dramalo prema storyla
parkulo kane kale kareedhainadhi
blackulo kone vele cinepremadhi
chupincharuga free show vesi premikulevvariki..ha haa..
jeevitham prathi nimishamu sommicchi pucchukora

deekshaga danalakshmini love aadi kattukora
Chakravarthiki veedhi bicchagattheki bandhuvavuthanani andhi money money
amma chuttamu kadhu ayya chuttamu kadhu aina anni andhi money money

kaalam kareedhu cheddam padhandi andhi money money
thailam tamasha chuddham padandi andhi money money
dabbu ni labudabbani gundello pettukora
deekshaga danalakshmi ni love aadi kattukora
dabbura dabbudabbura
dabbu dabbe dabbu dabbura
 

.:: TELUGU SONG LYRICS ::.

రచయిత - 'సిరివెన్నెల' సీతారామ శాస్త్రి
చిత్రం - మనీ


చక్రవర్తికీ వీధి బిచ్చగత్తెకీ బంధువౌతాననీ అంది మనీ మనీ
అమ్మ చుట్టమూ కాదు, అయ్య చుట్టమూ కాదు
అయినా అన్నీ అంది మనీ మనీ
పచ్చనోటుతో లైఫు లక్ష లింకులు
పెట్టుకుంటుందని అంది మనీ మనీ
పుట్టడానికీ పాడె కట్టడానికి
మధ్య అంతా తనే అంది మనీ మనీ
కాలం ఖరీదు చేద్దాం పదండి అంది మనీ మనీ
తైలం తమాష చూద్దాం పదండి అంది మనీ మనీ
డబ్బుని లబ్ డబ్బని గుండెల్లో పెట్టుకోరా
దీక్షగా ధనలక్ష్మిని లవ్వాడి కట్టుకోరా

చక్రవర్తికీ వీధి బిచ్చగత్తెకీ బంధువవుతాననీ అంది మనీ మనీ
అమ్మ చుట్టమూ కాదు
అయ్య చుట్టమూ కాదు
అయినా అన్నీ అంది మనీ మనీ

ఇంటద్దె కట్టావా నా తండ్రి, నో ఎంట్రీ  వీధి వాకిట్లో
దొంగల్లే దూరాలి సైలేంట్ట్లీ  నీ ఇంట్లో చిమ్మ చీకట్లో
అందుకే పదా బ్రదర్ మనీ వేటకీ
అప్పుకే పదా బ్రదర్ ప్రతీ పూటకీ
రోటీ కపడా  రూము  అన్నీ రూపీ రూపాలే
సొమ్ముని శరణమ్మని చరణమ్ము నమ్ముకోరా
దీక్షగా ధనలక్ష్మిని లవ్వాడి కట్టుకోరా

చక్రవర్తికీ వీధి బిచ్చగత్తెకీ బంధువవుతాననీ అంది మనీ మనీ
అమ్మ చుట్టమూ కాదు
అయ్య చుట్టమూ కాదు
అయినా అన్నీ అంది మనీ మనీ

ప్రేమించుకోవచ్చు దర్జాగా పిక్చర్లో లో పేద హీరోలా
డ్రీమించుకొవచ్చు  ధీమాగా డ్రామాలో ప్రేమ స్టోరీలా
పార్కులో  కనే కలే ఖరీదైనదీ
బ్లాకులో లో కొనే వెలే  సినీ ప్రేమదీ
చూపించరుగా ఫ్రీ షో  వేసి ప్రేమికులెవ్వరికీ
జీవితం ప్రతి నిమిషమూ సొమ్మిచ్చి పుచ్చుకోరా
దీక్షగా ధనలక్ష్మిని లవ్వాడి  కట్టుకోరా

చక్రవర్తికీ వీధి బిచ్చగత్తెకీ బంధువౌతాననీ అంది మనీ మనీ
అమ్మ చుట్టమూ కాదు
అయ్య చుట్టమూ కాదు
అయినా అన్నీ అంది మనీ మనీ
కాలం ఖరీదు చేద్దాం పదండి అంది మనీ మనీ
తైలం తమాష చూద్దాం పదండి అంది మనీ మనీ
డబ్బుని లబ్ డబ్బని గుండెల్లో పెట్టుకోరా
దీక్షగా ధనలక్ష్మిని లవ్వాడి  కట్టుకోరా
డబ్బురా డబ్బుడబ్బురా
డబ్బు డబ్బే డబ్బు డబ్బురా..

 ETV Swarabhishekam version :

Chakravarthyki Veedhi Song - Sung by SP.Balu garu : CLICK HERE

No comments:

Post a Comment